ఓదార్పు లేనిమార్పు: - డా.సి.వసుంధర


పట్టణపు వాసనకు దూరంగా
ఆరోగ్యానికి దగ్గరగా పల్లె జనం బతికిన రోజులు గతించాయి. 


పట్టణ భూతం కబంద హస్తం 
పల్లెలను
 కబళించేస్తున్నది

వారి అమాయకత్వం 
మాయల రాజకీయాలతో
ఆశువులు బాసింది.
పల్లెల పసి మనసులను గాయపరుస్తూ పట్టణాలు చుట్టుముట్లు 
తున్నాయి. 

చిన్న చిన్న పట్టణాలు దేశానికి క్షేమకరం 

కొన్ని పల్లెలమధ్య
అభివృద్ధి జరిగితే పల్లె ప్రజలు  జన్మభూమివదిలి కదిలి వచ్చి పట్టణాలలో పొట్ట గడుపుకొనే దౌర్భాగ్యం తప్పుతుంది. 

ఒకే చోట ఉండే అభివృద్ధి అది అభివృద్ధి కాదు 
అట్టడుగునున్న పల్లె ప్రజలకు జరిగే అన్యాయం. 

అభివృద్ధి
వికేంద్రీకరణతోనే 
విజయవంతం. 
పది పల్లెలను కలిపి పట్టణంగా మారిస్తే వారికి ప్రభుత్వ అండదండలు కలిగిస్తే పల్లెవారి అమాయకత్వం 
అద్భుతంగా 
ఆదర్శప్రాయంగా ఉపయోగపడుతుంది.
పల్లె ప్రజలు నేడు రెంటికి చెడిన రేవడి అన్న సామెత అయినారు. 

చేతివృత్తులకు పక్షవాతం వచ్చింది. 
గుడ్డి లో మెల్లగా కొంతమంది పల్లె పిల్లలు బాగుపడ్డా, పల్లెలు  వాడిన మల్లెలే.

పల్లెలను పట్టణాలలో కలపడం కాదు 

కొన్ని పల్లెలను పట్టణాలుగా మారిస్తే పల్లె ప్రజలు అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తారు.
కామెంట్‌లు