హృదిని తట్టితే అంశాల్ని సాగదీస్తా
కవిత కలలోకొచ్చి రాయమని కవ్విస్తే
ఊహలూరితే సంగతాల్ని సాగదీస్తా
పుష్పాలు విచ్చుకొని పరిమళాలు చల్లితే
భావాలు కూరితే వివరాల్ని సాగదీస్తా
చిరునవ్వులు చిందితే వదనాలు వెలిగితే
అక్షరాలా వ్యవహారాల్ని సాగదీస్తా
స్నేహితులు చెంతకొచ్చి సమయాన్ని అడిగితే
పదాలతో ప్రస్తావనాల్ని సాగదీస్తా
నా పుస్తకాలు కొని చదివి సంతసపడితే
పాఠకులు కొరకు ప్రకరణాల్ని సాగదీస్తా
శారదాంబ నన్ను కరుణించి వరాలిస్తే
వాణీదేవి వృత్తాంతాల్ని సాగదీస్తా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి