బోనాలు పండుగ!! : -ఎం. వి. ఉమాదేవి


ఆషాఢంలో బోనాల పండుగ 
ఊరూవాడల చేతన నిండగ
పోతరాజులు కొరడా పట్టగా 
ఊరేగింపులు గుడికే చేరగా!! 

గోల్కొండ సందడి సింహవాహిని 
బోనాలెత్తే ప్రతి ఒక మహిళామణి 
లాలు దర్వాజా బోనాలు 
చిందులు వేసే జనసమూహాలు,!! 

అద్భుతంగా ఉన్న అలంకారము 
అమ్మోరు పూని చెప్పేను రంగము 
ఆడపడుచు తెచ్చే బెల్లపన్నము 
తెలంగాణలో గొప్ప సంప్రదాయము!!
కామెంట్‌లు