తెలుగు భాష : - బి.బ్లెస్సి-10వ,తరగతి-జి.ప.ఉ.పా.రామంచ-జిల్లా. సిద్దిపేట


ఆకాశమంత తెలుగును విడిచి 
ఆంగ్ల భాషయందు ఆనందించి
అందమైన మాతృభాషను మరిచి 
అంధకారం లోనికి నడిచి 
అద్భుతమైన తెలుగును చీల్చి 
అందల మెక్కామని ఆనందించి 
నాడు తెలుగు భాషను గౌరవించి 
నేడు దాని స్థానంలో పరభాషను అమర్చి 
కొత్త కొత్త భాషలు సృష్టించి 
నిష్కల్మషమైన తెలుగును మంటల్లో కాల్చి 
ఏదో సాధించామని సంతోషించి 
మిసిని భాషను చదవడానికి సంకోచించి 
చీకటిని ఆహ్వానించి 
సుందరమైన భాషను సులువుగా విడిచి 
తెలుగు భాషను బంధించి 
పరభాషల వెంట నడిచి 
పూర్వం పెద్దలు తెలుగు గొప్పదనం గ్రహించి 
వారు తెలుగు భాష పై పట్టు సాధించి 
ఎన్నో సమస్యలను సులువుగా అధిగమించి 
ఎన్నో విజయాలను సాధించి 
మనకు తెలుగు భాషను అప్పగించి 
వారు చుక్కల్లోకె నడిచి 
నేటి తెలుగు భాష స్థితి చూసి ఏడ్చి 
కాబట్టి మనం ఇప్పటికైనా చలించి
మన సర్కారు కూడా తెలుగు భాష పై చట్టాలు తెచ్చి 
పరవాస మాయలో ఉన్న వారి కళ్ళు తెరిపించి 
ప్రతి పిల్లవాడి చేత మాతృభాష చదివించి 
మన తెలుగుకి పూర్వ వైభవాన్ని తెచ్చి 
తెలుగు భాష ప్రగతిని అంచలంచలుగా హెచ్చించి 
మన తెలివిని అందలం ఎక్కిద్దాం
 
కామెంట్‌లు