108 (2): - ఎడ్ల లక్ష్మి -\సిద్దిపేట


ఓ రాజకుమారా! స్వర్గమున దేవేంద్రునివలె 
అయోధ్యలో నీవు దివ్య భోగములను 
అనుభవించుచు హాయిగా విహరించుము
నేను చెప్పిన విధనముగా చేయుము 

ఈ లోకమున జనులు అష్టకాశ్రాద్ధములను
ఆర్థిక శ్రాద్ధములను నిర్వహించినచో 
అది పితృదేవతలకు చెందునని నమ్మెదరు
ఆ అన్నము ఇచ్చటనే నశించును గదా!

శ్రీరామా! ఈ గ్రంథముల గూర్చి దెలిపెద వినుము
దేవతలను ఆరాధింపుము, దానములు చేయుము,
యజ్ఞములను నిర్వహింపుము,
ఇల్లు వాకిలి వదిలి సన్యాసము స్వీకరింపుము, 

ఈ విషయములతో కూడిన గ్రంథము 
ఇతరుల సంపదలను అపహరించుటలో 
ఆరితేరిన వారు జనుల మనస్సును 
దానధర్మంల వైపు మళ్లించుటకై రచించిరి.

ఓ బుద్ధిశాలీ! తండ్రి మాటను విశ్వసించే నీవు 
ఈ లోకము తప్ప మరొక లోకము లేదని నమ్ముము
ఓ రామా! ఈ లోక సుఖములే వాస్తవములు 
భరతుని మాటవిని కోసల రాజ్యమును గ్రహింపుము.

====================================
అయోధ్యకాండమందు 108వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు