--------------------------
భరతుడు తల్లులకు నమస్కరించి
నందిగ్రామమునకు చేరుట - పాదుకలకు పట్టాభిషేకమొనర్చుట
------------------------
తల్లులను అంతఃపురములో నిలిపి
శోకసంతప్తుడై వసిష్టునితో ఇట్లు నుడివెను
ఓ మహార్షి! నేను ఇచట యుండలేను.
శ్రీరాముడులేని ఈ అయోధ్యయందు
నేను ఉండజాలను. ఉండలేను.
నేను నందిగ్రామమునకు వెళ్లెదను.
శ్రీరాముని వలన కలిగిన దుఃఖమును.
అచ్చట నిగ్రహించుకొనగలను.
మీరందరూ నాకు అనుమతినిండు
మా తండ్రి దశరథుడు స్వర్గమున కేగెను
అన్న వనములో నివసించుచున్నాడు
ఈ కోసలరాజ్యము వాస్తవముగా అతనిదే
అతడు వచ్చువరకు నిరీక్షించుచుందును
భరతుని మాటలు విన్న పిమ్మట
వసిష్ఠుడు, మిత్రులందరును ఇలా పలికిరి
ఓ భరతా! నీవు పలికిన వచనములు
మిక్కిలి సత్యమైన బలమైన వాక్కులవి
నీ మాటను ఎవరును కాదనజాలరు
భరతా! నీవేమి పలికిన ధర్మమే అగును.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి