ఋషులందరును కులపతితో గూడి చిత్రకూటమును వీడి వెళ్ళుట
శ్రీరాముడు కొంతకాలము ఆ వనములోనే
నివసించుచుండెను అచట తాపసులు
వేరే ప్రదేశమునకు వెళ్ళుటకు నిశ్చయించుకునిరి
ఆ విషయము శ్రీరామునికి చెప్పుటకై
ఆ మహర్షులు భయపడుచున్నారు
శ్రీరాముడు వారిలోని ఉత్కంఠను గమనించి
ఒక మహర్షి వద్దకు వెళ్లి ఇలా అంటాడు
ఓ మహర్షీ నావల్ల ఏదైనా దోషము జరిగినదా?
లక్ష్మణుని ద్వారా ఏమైనా తప్పు దొర్లేనా?
సీత వలన ఏ పొరపాటు వాటిల్లలేదుగదా ?
మీరు నాతో భయపడకుండా తెల్పుడు.
వయసున వృద్ధుడును దీర్ఘకాలము
తాప మొనర్చినవాడైన ఆ మహర్షి
శ్రీరాముడు పలికిన మాటలు విని
ఆ మహర్షి వణుకుచు ఇట్లు వచించెను
నాయనా! రామా! సీతాదేవి పవిత్రురాలు.
శుభములను గూర్చుటలో నిరతురాలు.
ఆ సాధ్వివలన ధర్మలోపము అసంభవము.
ఆమెచేసే సేవలో ఏ లోపము జరగలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి