శ్రీరాముడు సీతాదేవితో ఇట్లు నుడివెను
సీతా! మహర్షిపలుకులను వింటివి కదా!
నీ శ్రేయస్సుకై మహా తపస్విని జూచును
ఈ అనసూయాదేవిని అనుసరింపుము
సీతాదేవి శ్రీరాముని ఆజ్ఞానుసారము
అత్రిమహర్షిభార్యను అనుసరించెను
సీత ఆమెకు భక్తిశ్రద్ధలతో నమస్కరించెను
సీతాదేవితో అనసూయదేవి ఇట్లు పలికెను
సీతా! నీవు మిక్కిలి అదృష్టవంతురాలువు
ధర్మమార్గమును అనుసరించుచున్నావు.
రాముని అనుసరించుచున్న భాగ్యశాలివి.
వైదేహీ! నేను ఎంతగానో యోచించి చూచితిని
భర్తను మించిన ఆత్మీయుడు నాకు కనబడలేదు
మనము చేసిన పూజ వలన శాశ్వత ఫలము
భార్యను రక్షించుచు సుఖములను చేకూర్చును
ఓ సీతా!నీవు నీపతిదేవుడైన శ్రీరాముని
సేవలయందు నిమగ్నమై యుండుము
పతివ్రతధర్మములను పాటించుము
నీ భర్తకు సహధర్మచారిణివై యుండుము
నీవు చక్కని కీర్తి ప్రతిష్టలు పొందగలవు.
==========================================
అయోధ్యకాండమందు 117 వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి