119వ సర్గ :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట

శ్రీరాముడు సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యమున ప్రవేశించుట 




అనసూయదేవి పవిత్రకళ్యాణగాధను విని 
తన రెండు చేతులతో సీతాదేవిని 
గాఢముగా గుండెలకు అత్తుక్కొని 
సంతోషంతో ఆమెను ఆశీర్వదించెను. 

ఓ ప్రియభాషిని! సీతా! నీ స్వయంవరము గూర్చి 
మధురవచనములతో విషదపరిచితివి 
నేను అది అంతయు శ్రద్ధగా ఆలకించితిని 
అద్భుతగాథను విని ఆనందభరితురాలునైతిని 

కిరణకాంతులతో విరాజిల్లుచున్న సూర్యుడు 
అస్తమించుచున్నాడు 
చల్లని రాత్రి ఆసన్నమగుచున్నది 
మేతకు వెళ్లిన పక్షులు గూటికి చేరుచున్నవి 
మునులంతా కలిసి మెలిసి వస్తున్నారు. 

నక్షత్రములు మిల మిల లాడుచున్నవి 
ఆకాశమున చంద్రుడు వెన్నెల దుప్పటిని 
భువిపై పరుచుచు వృద్ధి చెందుచున్నాడు 
రాత్రి సంచరించే జంతువులు తిరుగుచున్నవి 

సీతాదేవి ఇక నీవు నీ పతి చెంతకు వెళ్ళి
నీ పతి శ్రీరాముని సేవలో నిమగ్నమగుము
నీ మధురమైన భాషా భావమును విని 
నేను ఎంతగానో సంతోషించితిని.

కామెంట్‌లు