త్యాగయ్య కులవివక్ష ఏట ఉపనయనం చేశారు.సంస్కృత ఆంధ్ర భాషల్లో పట్టుసాధించిన ఆయన తండ్రితోపాటు రామపూజ చేసేవాడు.రామషడక్షరీమంత్రదీక్షతోపాటు తిరువయ్యూర్ సంస్కృత పాఠశాలలో చేరి 4ఏళ్లు చదివి వేదవేదాంగాలు, జ్యోతిష తర్క వ్యాకరణ గణిత మంత్రశాస్త్రాల్లో ప్రవీణుడైనాడు. తల్లి సీతమ్మ మంచిగాయని. ఆమె తండ్రి వీణ కాళహస్తి అయ్యర్ దగ్గర సంగీతం నేర్చుకుంది.పురందరదాసు జయదేవ,భద్రాచలరామదాసు పాటలు పాడేదామె.తల్లితో కూనిరాగాలు తీస్తూ తండ్రి వేరే ఊరికెల్తే అపూర్వంగా దైవ స్తోత్రం చేస్తూ వచ్చిన ఆసాహిత్యమే దివ్యనామసంకీర్తనంగా కీర్తి గాంచింది.వాటిని ఇంటిగోడలపై రాశాడు." దేశికతోడిరాగంలో "నమోనమోరాఘవాయ అనిశం..నాగరాజపాలనాయ త్యాగరాజ సేవితాయ" అలాంటి ఒక కీర్తన.
పూలకోసం త్యాగయ్య రోజూ ఆనందనార్ కురుచ్చి అనే ప్రాంతానికి వెళ్లేవాడు.శొంఠి వేంకటరమణభాగవతుల ఇంట్లో పిల్లలు సంగీతం నేర్చుకుంటుంటే నిలబడి వినేవాడు.1782లో త్యాగయ్య రెండోఅన్నకి బాగా జబ్బు చేస్తే,త్యాగయ్య కాపి రాగంలో" అన్యాయము సేయకురా రామా,అన్యునిగా చూడకురా నా ఎడ..జడభరతుడు జింకశిశువునెత్తి బడలిక తీర్చగలేదా" పాడారు.ఆరాత్రి శ్రీరాముడు కలలో కనిపించి" మీ అన్నయ్య కు ఆయుష్షుతీరింది.బాధపడకు" అని చెప్పాడు.ఆ అన్న చనిపోయాడు.శ్యామశాస్త్రిగారుకూడా తనకు ఆరోగ్యం ప్రసాదించమని కామాక్షిదేవతను వేడుకున్నారు. 1783లో త్యాగయ్య శొంఠి వెంకట రమణయ్య గారివద్ద సంగీతం నేర్చుకోసాగాడు.ఏడాదికల్లా గొప్ప విద్వాంసుడైన త్యాగయ్య వీణ వాయించేవాడు.ఆవీణ ఇప్పటికీ భద్రంగా ఉంది.18వ ఏట రామకృష్ణానందయతీంద్రులు త్యాగయ్య కి మంత్రోపదేశం చేశారు.రోజుకి1,25,000 చొప్పున 21ఏళ్లు జపించాడాయన.అంటే 18 వ ఏట నుంచి 40ఏళ్లు వచ్చేటప్పటికి 96 కోట్ల జపం చేసిన మహామనీషి,భక్తుడు త్యాగయ్య. అది నామజపం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి