త్యాగరాజు దినచర్యను పరిశీలిద్దాం. త్యాగయ్య ప్రభాతకాలంలో మేలుకొని ఏకపీఠవిగ్రహం వద్ద సౌరాష్ట్రరాగంలో" మేలుకో దయానిధి మేలుకో దాశరథీ మిత్రోదయామౌవేళ,నారదాదిమునులు సురలు వారిజభవు డిందుకళాధరుడు నీసన్నిధినేకోరి కొలువుగాచినారు, రాజరాజాది దిగ్రాజులెల్ల వచ్చినారు,రాజనీతితెలియ త్యాగరాజ వినుత నన్నుబ్రోవ"
ఆకలితీరేలా పాలారగింపు, " చనువున ఘనునకు పన్నీటిస్నానము" చేయించిన భక్తుడు.త్యాగయ్య చేసింది రామనామమే.సౌరాష్ట్రరాగంలో " పతితపావన సమ్మతమున...సమరహితరామనామము సతతముసేయ నీవ్రతముగోరితిగాని..." అనే కీర్తన లో స్పష్టంగా తెలుస్తుంది.జప్యేశమంటపంలో రామునికి షోడశోపచారపూజలుచేసి, ప్రసాదం తిని కాసేపు విశ్రాంతితీసుకుని సాయంత్రం శిష్యులకు పాఠంచెప్పి కావేరిలో స్నానం చేసి సంధ్యావందనం ఐనాక ఇల్లుచేరేవాడు. ,"చేతులార శృంగారముచేసి రాగరత్నమాలికచే అంటూ కొత్త రాగాలతో" ఊయ్యాలలూగవయ్యశ్రీరామ" అని పాడుతూ ," జోజో రామా ఆనంద ఘన జోజో..మృదుతరభాష..మంజులవేషరామా..త్యాగరాజార్చితరామా భక్త సమాజరామ" అని ఆరోజు కి దినచర్య ముగించేవారు🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి