కొన్ని బంధాలు కాలంతో ఏర్పడేవి కావు; ఒక క్షణం భావనలో పుట్టి, జీవితాంతం గుండెల్లో నివసిస్తాయి.
కొన్ని ఆశలు నెరవేరడం కోసం కావు, మన చేతుల్లో ఉన్న మిగులును కూడా కోల్పోయేలా చేయడానికే పుడతాయి.
కొన్నిసార్లు జీవితం మనలను పిలవడం బతికించడానికి కాదు, మనం ఎంత ఒంటరివారమని తెలుసుకోవడానికి.
రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయం మీద అబద్ధపు కేసు వేయలేము.
బంధం గొప్పతనాన్ని డబ్బుతో కొలవలేం. అవసరమైన వేళ వెనుకాడకుండా తోడునిలిచే మనసుతోనే కొలవాలి.
సంపద తగ్గవచ్చు, పరిస్థితి మారవచ్చు…
కానీ, కష్టంలో చేయినిచ్చే మంచి మనసు దొరికితే, అదే జీవితపు గొప్ప సంపద.
గడిచిపోయిన రోజుల గుర్తులను రాత్రి చీకటిలో పాతిపెట్టి, రాబోయే ఉదయం గుమ్మం వద్ద కొత్త కలలతో ఎదురుచూస్తుంటాం, ఔనన్నా కాదన్నా!
పాపాలను దుప్పటిలో దాచినవారు తెల్లవారడాన్ని చూసి భయపడతారు, ఎందుకంటే వెలుతురు వస్తే, దాచుకున్న ముఖాలూ దాచుకున్న నిజాలూ దానంతట అవే గట్టిగా మాట్లాడటం మొదలుపెడతాయి కనుక!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి