సామెత -339: ఇగురం తప్పిన పనికి ఊరటేడుంటది
***
"ఏందో అవ్వా! శెప్పితినక పాయె వొంట బుట్టదాయె.ఒక్కటన్న సక్కరంగ జేసిన పాపాన పోలేదు. గదేందిరా అయ్యా అంటే ఎహె ఊకోవె.నేనే శనం తీర్క లేక యిశారంల మునిగుంటే ఒకటే నసబెడ్తవు అంటడు."
"ఏంది శెల్లే! మీ బీమేషు ముచ్చటేనా నువు శెప్పేది.గీ నడ్మల గదేదో వోటలు బట్టిండని ఇన్న బాగ నడుత్తుందా?"
"ఏం నడుసుడులే అవ్వా! గదే మంచిగుంటె గింత రంది ఎందుకుంటది.గిది నీకు శాత గాదురా మనకున్న బూవిలో ఎగసాయం జెయ్యిరా అంటే నాయిన లెక్క మట్టిల,బుర్దల బత్కుడేనా పైసలియ్యుండ్రి ఏదన్న యాపారం జేత్త అన్నడు.గందుల కిట్కులు తెల్వకపోతె లాబం గూబలకి బోతదిరా అంటే యిన్నడా?జెనిగె పట్టు బట్టిండు. బట్టల యాపారం జేత్త అన్కుంట పేటల పెద్దెత్తున అడావిడి జేసి పెట్టిండు.గాడికి వొచ్చినోళ్ళంత మనూల్లోల్లు,గానికి తెల్శినోళ్ళు.ఇంగేముంది శానా మందిరి ఉద్దెరకి తీస్కున్నోళ్ళు అటు మొగమే గని మల్ల తిర్గి సూశిన దిక్కు లేదు.పైసలు రాక మల్ల తేలేక అడుగు బొడుగు వున్నయి అడ్డికి పావుసేరు అమ్మి శేతులు దుల్పుకుండు.
గంతటితోనే ఆగక పొయ్యిండా శెల్లే.గంత నట్టమొచ్చె.
"గట్లింటె వాడెట్లయితడవ్వా ఒక్కపాలి గట్లయింది ఎప్పుడైతదా ఏంది అన్కుంట గుడి తాన పూలకొట్టు బెడ్త.దేవునికి గొంటరు.అమ్మలక్కలు శికెల,జెడల ముడ్సుకోడానికి కొంటరు" అని పైసలిచ్చే దన్క వజ పుచ్చుకుండు.ఇట్టం లేక పోయినా గాని మన్సు బాదవడ్తదని పూల కొట్టుకి పైసలిచ్చినం.గవీటి పానమెంత ఒకట్రొండు దినాలేనాయె.అమ్ముడు బోకపోతే పెంటగడ్డ మీద పారవోసుడే అని శెప్పినం.గాళ్ళు దినాం కాతా బెట్కొని కొంటర్రా.ఎవలు బడ్తే ఆళ్ళకాడ కొనరు.సరింగ అమ్ముడుబోవురా అన్నా యినకుండ బెట్టిండు.గా పూలని పసివిల్లల లెక్క సూడాలె అని సుత శెప్పిన.గా తెచ్చినయ్ అమ్ముడుబోక నీరుశిచ్చు బట్టి కరాబైనయ్.నెల దిర్గక మున్పే నిండా మునిగిండు.
గంతటితోనన్న బుద్ధి గ్యానం తెచ్చుకోవాలె గద శెల్లే!"
"గట్ల దెచ్చుకుంటె గిన్ని శెరలు ఎందుకుండేవి అవ్వా!"
"ఇంగనన్న ఆగరా కొడుకా అంటే యినకుండ వోటెలు బెట్టిండు.గీ పనికి ఎంత శాకిరి వుంటది.సేశేవి కమ్మగ సుబ్రంగ జేత్తెనే గద.ఎవలన్న వొచ్చేది.మొదగాల మంచిగొచ్చినోళ్ళు రాన్రానూ సరింగ పనోళ్ళు లేక వొచ్చుడు ఆపిండ్రు. వొండినయి దాయలేక, పడెయ్య లేక గిది నా వొల్ల గాదు అన్కుంట గది తీశేసి గిప్పుడు ఇంగేం జెయ్యాల్నా అని యిశారిత్తుండవ్వా. ఎందుకిట్లైతుంది నాకు అన్కుంట గాడు రంది వడుడే గాదు మాకు సుత కంటి మీద రెప్ప వడుడు లేదు."
"బాగనే ఉంది కత.గిట్ల "యిగురం తప్పిన పనులు శేత్తుంటే ఊరటేడుంటది". పతొక్కటి పైసల్తోనే ముడివడుండె.పైసలు ఊకెనే వత్తాయి.గయ్యేమన్న శెట్లకు గాసేయా? మీరు గాబట్టి పొల్లగాని మీద పేమతో గింత కర్సు జేసిండ్రు.ఇంకోలింకోలైతే నీ బత్కు నువ్వు బత్కు పది రూపాయిలు సంపాయించుకొచ్చి గప్పుడు మాట్లాడుమనేటోళ్ళు.'
"ఏం జేత్తమవ్వా! పొల్లగాడు రందివడి ఆగమైతడని గిట్ల కట్టపడి సంపాయిచ్చుకున్న సొమ్మంత గాని దోశిట్ల బోశినం."
"నువ్వు శెప్పింది సుబూదిగ నిజవేఁ అవ్వా!"ఇగురం తప్పిన పనికి ఊరటేడుంటది". గాన్ని నీ తానికి తోల్కొత్త గని గిప్పన్నించైన మీ మర్దితో కల్శి బుద్దిగ ఎగసాయం జెయ్యమని శెప్పవ్వా!"
గట్లనే శెల్లే! గానికి సమజయ్యేతట్టు నేను జెప్త."
" గదండీ సంగతి! "ఇగురం తప్పిన పనికి ఊరటేడుంటది " అంటే గిదే మరి. పశాంతత ఏడుంటది. సమజైంది గదురుల్లా"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి