సామెత-342: ఇచ్చేటోడు గాదు, సచ్చేటోడు గాదు -పూటపూటకి కూటికి వచ్చుడు గాడు
****
"అవ్వా! కొంతమందిరి శానా గమ్మతిగుంటరు గదా! వాళ్ళ యవ్వారం సూత్తుంటే సూశేటోళ్ళకి గంత మంచోళ్ళు లోకంల ఉండరేమో అనిపిత్తది.ఉల్లిగడ్డ పొరల్లెక్క మనత్తత్వం యిప్పిసూత్తెగని శవ్వా! గాళ్ళేం మడుసులు అనిపిత్తది.గట్ల ఆశబెడ్తరు.కుక్క గన్క బొక్క కనుకుడే గని గందుల్ల దానికి ఏం పాయిదుండదు.ఆకలి దూప తీరది గని ఏదో వుందనే ఆశ దాన్ని గట్ల కనికెతట్టు శేయిత్తది."
"ఏంది శెల్లోవ్! 'కుక్క బొక్క',ఉల్లిగడ్డ మల్లిగడ్డ అని బలేగ శెప్తున్నవ్ ఎవలిముచ్చటేంది?"
"గదేనవ్వా! మన రాజక్కింటికి శెల్లే, బావ అన్కుంట దినాం వొచ్చి పోతుంటడు సూడు గా నర్సన్న ముచ్చెటినే అవ్వా!"
"అవునా శెల్లే! ఏందట సంగతి ఏవంటడంట.పొద్దున్నే శాయ సుక్క తాగే సయిమానికి వొచ్చి శెల్లే నీ శేతిల ఏం మయిముందో ఏమొగని నువ్వు జేసే శాయి అమృతం లెక్కుంటదనేటోడు. గట్ల పొద్దుగాల సూరిడు పొడ్సుడన్న ఆలీశం జేసేటోడు గని గా నర్సన్న మాత్తరం పొద్దున్నే వొచ్చి అరుగు మీద కూసునేటోడు. పైంగ "శెల్లే నీ రుణమెట్ల తీరాలె! గంద్కనే గీ త్యేప శేల పండిన పెసలు, కందులు,శనిగలు పట్టుకొత్త అనేటోడు .గట్ల ఏండ్లేండ్లు శెప్పిండు శెల్లే!"
"మరి పట్క రాలేదా అవ్వా! "
"గట్ల పట్కొత్తే నర్సన్నెట్లయితడు,గియ్యాల గా ముచ్చెటి ఎందుకు శెప్కుంటం శెల్లే! నీకెందుకు శెల్లే రేపు పట్కొత్త మాంచి పప్పొండు గందుట్ల ఎయ్యడాన్కి శేల నేల బారు కాత్తున్న బుడం దోస్కాయలు తెత్త.గదెంత రుశిగుంటదన్కున్నవ్ అని శెప్పేటోడు.తెల్లారి సూశి సూశి కండ్లు కాయలు గాశేటియి.మీ బావ అనేటోడు"నమ్మక నమ్మక గాని పోరంబోకు మాటలే నమ్మి,గాని పేర్తో పచ్చడి మెత్కులు దినబెట్టినవ్ గద!" అని."
"ఇంగ రాకుండ అటేబోయిండా అవ్వా!"
గట్లయితే బాగనే వుండు మూడొద్దులాగి శెల్లే! బావ అన్కుంట తినే సయిమానికి,శాయ తాగే సయిమానికి వొచ్చి ఏవేవో కథలల్లి శెప్పేటోడు శెల్లే!"
"వామ్మో! గా నర్సన్న గస్మంటోడా? రాజక్క అంటుంటే గంత పెద్దమడిషి గురించి ఎందుకట్ల అంటుంది అన్కున్న అవ్వా!"
"మీ బావన్న పోనీలేవే గాడు తినే బుక్కెడు బువ్వకి గన్ని అవద్దాలాడ్తుండు. గానికి ఉంటే ఉంది గాన్నెత్తిన్నే గొట్కోని.నువ్వైతే ఏవఁనకుండ పెట్టు అన్నడు."
"నేనే! ఓ దినం మీ బావ లేనప్పుడు వొత్తే "అన్నవని శెప్పి నా పర్వు తీత్తున్నవ్ ఒక్కపాలెన్న మాట నిల్పుకోవైతివి" అని 'దూడకి బర్రెకి ఏకి దుల్పిన' .అగ్గో గయాల్టి సంది మా యింటికొచ్చుడు మానిండు ఇంగ రాజక్క ఇంటి తొవ్వ బట్టిండేమో శెల్లే!"
"గంతే కావచ్చు అవ్వా! నీ తాన జర్గినట్టే అచ్చుకాయితం లెక్క గాడ సుత జర్గింది. బావ లెక్క ఊకుంటడా ఏంది? గాడు అద్దెత్త ఇద్దెత్త అన్నడేమో యెయ్యి అని అడ్గుడు తిట్టుడు, గాన్ని ఇంకోపాలి రానీబాకుమని, వొత్తే నీ సంగతి సూత్త నని తిట్టిన తిట్టు తిట్టకుండ తిట్టిండట అవ్వా!"
గదే గద శెల్లే! నిన్న నేను,గియ్యాల రాజక్క,రేపు ఇంకొకలు గా అన్న తీపి మాటల్కి మైమర్వకుండ,నమ్మకుంట ఉంటరా శెప్పు. గట్ల ఎవలో ఒకింటికి వొత్తనే వుంటడు.గా అన్న జల్మ గంతే.
"గందుకే గా అన్నని సూశినప్పుడల్ల మీ బావ " ఇచ్చేటోడు గాదు సచ్చేటోడు గాదు పూట పూటకి కూటికి వచ్చుడు గాడు" గాడేనే మీ అన్న అని పరాష్కం ఆడ్తుంటడు మీ బావ!"
"అవ్వా! గా నర్సన్న వెనకాతల గింత కతుందన్న మాట."
"అవ్ శెల్లే! ఇచ్చేటోడు గాదు.సచ్చేటోడు అంటే మాట సాచ్చం మీద నిల్వడేటోడు గాదు. పూట పూటకి మాత్తరం మనమే బాకీ ఉన్నోళ్ళ లెక్క అడిగి పెట్టిచ్చుకుని తినేటోడు అంటే గా న్న"
"గదండీ సంగతి! "ఇచ్చేటోడు గాదు సచ్చేటోడు గాదు- పూట పూటకి కూటికి వచ్చుడు గాడు "అంటే గిదే మరి." కొందరు గట్లుంటరు. కీసల పైస కర్సుగాకుండ కాలం ఎల్ల దీయాలని సూత్తరు. గస్మంటోళ్ళకి శీము నెత్తురు,శిగ్గు,పెరు వుండవని పెద్దోళ్ళు అంటుంటరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి