హిందూ పురాణాలు, మహాభారతం ప్రకారం కృతస్థలి ఎంతో అందమైన ప్రసిద్ధ అప్సరస. ఇంద్రుని సభలోని ముఖ్యమైన అప్సరసలలో ఒకరుగా గుర్తింపు పొందారు. పురాణాలలో ఈమె ప్రస్తావన ప్రధానంగా రెండు సందర్భాలలో కనిపిస్తాయి. ఋషుల తపస్సు భగ్నం చేయడం, సూర్య భగవానుని సేవించడం.
పురాణ కథల ప్రకారం ఒకసారి ఒక మహర్షి (కొన్ని కథలలో కణ్వుడు, చ్యవనుడు అని ఉంటుంది) ఘోర తపస్సు చేశారు. ఆ తపస్సు శక్తికి ఇంద్రుని సింహాసనం కదిలిపోయింది.
ఋషులు తమ స్వర్గ రాజ్యాన్ని లాక్కుంటారనే భయం ఇంద్రునికి కలిగింది. అందుకే తపస్సు భగ్నం చేయడానికి అత్యంత అందమైన అప్సరస కృతస్థలిని భూమికి పంపారు. కృతస్థలి తన సౌందర్యం, తియ్యని గానం, నాట్య కళలతో ఆ రుషి ధ్యానాన్ని భగ్నం చేసింది. ఆ రుషి ఆమె అందానికి ఎంతగా మోహించారంటే తన స్పృహ కోల్పోయి తపస్సు భగ్నమైంది. చాలా సంవత్సరాలు ఆమెతోనే గడపడంతో ఇంద్రుని ఉద్దేశం నెరవేరింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి