రాజా హరిశ్చ0ద్రునిలా
ఆలు,బిడ్డ నమ్ము కుని కాటి కాపరి కావచ్చు !
పంచ పాండవులిలా
దిరి పెములై బిచ్చ మెత్తుకునో...
అరణ్య వాస, అజ్ఞాత వాసములో చేయనూ వచ్చు ...
నల, దమయంతుల్లా
అష్ట కష్టాలు పడనూ వచ్చు...!
అంతెందుకు మా నరిసి గాడిలా నష్ట జాతకుడై
శారీరక అనా రోగ్యాలు ఆర్ధిక ఇబ్బందులు...
అవహేలనలు , అవమానాలు జీవి తాంతము అనుభ వించ నూ వచ్చు..!!
అది కాల మహిమయే గాని,
మన తప్పు లేదను కుంటే...
పొర పాటే కదూ...!
నేడు మనం దాచు కున్నదే గా...
రేపు మనం అనుభ వించేది...!
నేటి మన అనుభవం
నిన్నటి దాపరికం...!
దీ న్ని ఎవ్వరూ తప్పిం చలేరు...!
అంటే...
వర్తమానం మన చేతిలో లేక పోయినా
భవిష్యత్ మన చేత ల్లోనే వుంది...!!
ఈ సత్యాన్ని గ్రహించిన వారు...
తమ ప్రారబ్ధాన్ని
మౌనంగా అనుభ విస్తూ...,
భవిష్యత్తును బంగారు మయం చేసుకునే
ప్రయత్నం చేసుకుంటారు...!
అవివేకులు తమ అజ్ఞా నంచేత....
కుమిలి పోతు...
పదింతలు తప్పులు చేస్తు....
జన్మ జన్మ లకు...
దుఃఖాలనే అనుభ విస్తు0టారు...!!
అజ్ఞానమే బంధము, దుఃఖము...!
జ్ఞానమే మోక్షము, ఆనందము...!!
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి