చట్టసభ సమావేశాలు
పుట్టలోని పాములు
గట్టు తెగిన ఆక్రోశంతో ఆవేశాలు
బడిలో బాలలకు నేర్పు ఫైటింగులు
ఇల్లు వదలని, డుమ్మాపెద్దలు
కల్లు తాగిన కోతుల గంతులు
ఎన్నికల్లో కోట్ల ధనం
జనాలకి ఫ్రీగా కాలక్షేపం
సోషల్ స్టడీస్ టీచర్లకు శోష
విన్పించుకోరు విద్యార్థులు వారి ఘోష!
ఎన్నికల్లో నిలబెడదాం పహిల్వాన్లను,
ముష్టి ఘాతాలు, పిల్లిమొగ్గలతో శిక్షణ
కనీసం దాదాలకి చెంచాగిరీ చేస్తే సజావుగా సభలు
బొక్కలదవాఖానాలకి గిరాకీ
బందులు, రాబందులకి సలాం
గూండా పాలనకు గులాం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి