వెంకట్ కొత్తూర్ కు “అంతర్జాతీయ ప్రతిభ పురస్కారం”
 

నమస్కారం.  గత శనివారం, మీ లాంటి పెద్దలు సహృదయుల ఆశీస్సులతో, నేను “అంతర్జాతీయ ప్రతిభ పురస్కారం” అందుకున్న  రోజునే, యాదృచ్ఛికంగా ఈ మన  తెలుగు పత్రిక “మొలక “ లో నేను రోజుకు ఒక పద్యము చొప్పున ధారావాహికముగా వ్రాస్తున్న “ ప్రవాస పద్య పరిమళం” శీర్షికకు 100  వ పద్యము కూడా ప్రచురించ బడిందని తెలియ చేయడానికి సంతోషిస్తున్నాను. 
సాహితీ స్రష్టలు, శతక కర్తలు, అవధానుల సమక్షములో ఇది చాలా, చాలా చిన్న విషయమే, కానీ నాకు ఓ చిన్న మెట్టు ఎక్కిన  సంతోషము, మీతో పంచుకోవడం నా భాగ్యము.🙏
కామెంట్‌లు