ప్రవాస పద్య పరిమళం - 126 : - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 నవరాత్రి శుభాకాంక్షలు! 
శ్రీ దుర్గా దేవి  - 8 వ రోజు 



చంపక మాల:

జగముల గావవే జనని చారు సుహాసిని శాంత రూపిణీ
నిగమము లన్ని నీ గరిమనే కొనియాడెను శక్తి రూపిణీ 
తెగువన దైత్యులన్దునుము ధీమతి గౌరి త్రిశూల ధారిణీ 
నగజ  గిరీశు రాణి నిను నామది గొల్తును నిష్కళంకిణీ 
కామెంట్‌లు