నిన్ను ఆకలి దప్పులు ఎప్పుడు బాధింపవు
సీతాదేవి అతనిని శంకించుచు ఇట్లనెను
నీవు దేవేంద్రుడవని నేను విశ్వసించుటెట్లు?
సీతాదేవి అనుమానమును గమనించి
తన దివ్య చిహ్నములను ప్రకటించెను
తన పాదాలు నేలకు తాకకుండా నిలిచెను
ఆయన కనురెప్పలు మూతపడలేదు
ధూళి స్పర్శ లేని దుస్తులు ధరించియుండెను
ఆయన ధరించిన పూలమాల వాడిపోలేదు
ఆయన దివ్య చిహ్నములను గాంచిన
సీతాదేవి ఇంద్రుడని విశ్వసించెను.
అనంతరము ఆ జానకి చిరునవ్వుతో
ఆమె ఆ పాయసమును స్వీకరించెను
రామలక్ష్మణలకు నివేదన చేసి భుజించెను
పాయసము భుజించాక ఆకలి బాధ తొలిగెను
ఇంద్రుని నోట రామలక్ష్మణుల గూర్చి
తెలుసుకొని సీతాదేవి సంతోషించెను
దేవేంద్రుడు సీతాదేవిని వీడుకొని
నిద్రాదేవితో గూడి అమరావతికి చేరెను.
=================================
అరణ్యకాండమందు ప్రక్షిప్త స్వర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి