రామలక్ష్మణులను జూచిన సుగ్రీవుడు వారు వాలి పంపగా వచ్చిన వారేమో?
అని శంకించి భయపడుట.
రామలక్ష్మణులను సుగ్రీవుడు జూచి
వారు వాలి పక్షమువారు అని భావించి
ఆ వానరశ్రేష్టుడు మిగుల భయానికి లోనయ్యెను
సుగ్రీవుడు తన అనుచరులతో ఇట్లనెను
ఓ సహచరులారా! ఈ దట్టమైన అడవిలో
సంచరించుచున్న వీరు ఎవరో కారు
వాలి పంపగా వచ్చిన గూడాచారులే"
వాలి గూర్చి భీతితో యున్న
సుగ్రీవునితో వానరులతో హనుమంతుడిట్లనెను
వాలి ఈ ఋష్యమూక పర్వతమునకు రాలేడు
మీకు వాలి వలన ఎట్టి ప్రమాదము ఉండదు .
క్రూరుడైన వాలి మునిశాప కారణముగా ఇటు రాలేడు
ఓ సౌమ్యా! నీ భార్యను అపహరించిన నీ అన్న
కౄరకర్ముడు అతనికి నీవు భయపడుటేలా?
ఇచ్చట వాలి వలన నీకు ఎట్టి ప్రమాదము కలుగదు
ఓ ప్రభూ! సామాన్య వానరునిలా ఉంటే ఎలా?
సుగ్రీవుడు హనుమంతుని మాటలు విన్న పిదప
అతడు వాటికంటే మేలైన వచనములను
ఆ వాయు పుత్రునితో వివరించెను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి