రెండవ సర్గ : ( 2 ): - ఎడ్ల లక్ష్మి


ఓ వాయుసుతా! మనకు కనబడుచున్న 
ఆ ఇరువురు అజానుభాహువులు
మారువేషంలో వచ్చిన శత్రువులే 
నమ్మించి దెబ్బతీయుటకే ఇటు వచ్చిరేమో! 

వాలి ఈ కొండమీదికి రాలేకపోవచ్చు కానీ 
అతని మిత్రులు ఇచ్చటికి రావచ్చు కదా! 
వాలి సర్వ కార్యములను నిర్వహించగలడు 
వారిని మానవుల వేషంలో ఇటు పంపవచ్చు 

ఓ మారుతీ! నీవు సామాన్యమానవునివలె 
వారి కడకు వెళ్లి వారిగూర్చి తెలుసుకొనుము 
వారిని ప్రశంసలతో ముంచేత్తుచూ 
వారి గూర్చి నిజమును తెలుసుకొనుము. 

ఓ వానరోత్తమా! నీవు వారికి ఎదురుగ నిలిచి
ఈ వనమునకు వచ్చిన కారణమడుగుము
వారి మాటలనబట్టి  వారి చేష్టలతో 
వారు సజ్జనులౌనా! కారా! తెలుసుకొనుము.

వానర రాజైన సుగ్రీవుడిట్లు ఆదేశించగా 
మారుతి రామలక్ష్మణుల కడకు వెళ్ళుటకై 
మహాత్ముడైన హనుమంతుడు సరే అని 
రామలక్ష్మణుల యొద్దకు బయలుదేరెను. 
=================================
కిష్కింధాకాండమందు 2 సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు