47వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
సీతాదేవి తనని గూర్చి తన భర్తయగు శ్రీరాముని గూర్చియు రావణునికి తెలుపుట. 




వచ్చినవాడు బ్రాహ్మణుడు పైగా అతిథి 
ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానముగా 
ఆ రఘుపత్ని రావణునితో ఇలా పలికెను.
ఓ బ్రాహ్మణ నా గూర్చి దెలిపెద వినుము 
 
మిథిలానగర ప్రభువైన మహాత్ముడగు
జనక మహారాజు యొక్క కుమార్తెను నేను
నా పేరు సీత, శ్రీరాముని భార్యను 
దశరథమహారాజు యెక్క కోడలును.

అయోధ్యలో జరిగిన విషయములన్నియు 
సీతాదేవి రావణునితో యుక్తముగా తెలిపెను 
తండ్రి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు ఇచటికి వచ్చి 
మునుల యజ్ఞములను రక్షించుచున్నాడు.

అతని ముద్దుల తమ్ముడు లక్ష్మణుడు 
అతడు మిక్కిలి పరాక్రమశాలి
అతడు శ్రీరామునకు కుడి భుజము 
లక్ష్మణుడు నా రక్షణకై మా వెంట వచ్చెను. 

ఓ బ్రాహ్మణోత్తమా! కైకేయి తృప్తి కొరకు 
మేము ముగ్గురము రాజ్యమును వీడి 
ఈకికారణ్యములలో నివసించుచుంటిమి 
ఈ పవిత్ర స్థలమందు నీవు విశ్రాంతి తీసుకొనుము. 

కామెంట్‌లు