రావణుడు తన సంపదలను గొప్పలు చెప్పుకొనుట ,
రావణుని సీతాదేవి తులనాడుట.
నేను దశకంఠుడను పరాక్రమశాలిని
కుబేరుడు నాతో ద్వంద యుద్ధానికి దిగి ఓడిపోయి
సంపదతో విలసిల్లుచున్న రాజ్యము నాకిచ్చెను.
ఆ కుబేరుని పుష్పక విమానమును
నా పరాక్రమముతో అతని నుండి పొందితిని
అది యజమాని కోరికను అనుసరించి
ఎచ్చటికైనను పయనించగలదు.
నేను కన్నులెర్ర చేయగా దేవతలు బీతి చెందెదరు
సూర్యుడు నాకు భయపడి చల్లబడును
నేను తిరుగాడే చోట చెట్లు కదలవు
అంతేకాదు నదులు వేగముగా ప్రవహింపవు
ఓ సుందరీ! మానవలోక భోగములను
దివ్యలోక భోగములను అనుభవించవచ్చు
అల్పాయష్కుడైన శ్రీరాముని గూర్చి
నీవు అసలే స్మరింపకుండ ఉంటావు.
జ్యేష్టుడైన ఆ రాముడు అసమర్ధుడగుటచే
దశరథుడు అతనిని వనములకు పంపెను
ఓ విశాలాక్షీ! రాజ్యభష్టుడగుటచే
కర్తవ్యముయెడల నిర్ణయశక్తిని కోల్పోయెను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి