నిప్పు కణికలవలె ప్రకాశించుచుండెను
అవి ఆకాశము నుండి ఒక్కొక్కటి
మెరిసే చుక్కలవలె రాలుచుండెను.
రావణుని యొక్క గమనవేగమువలన
ఏర్పడిన గాలుల యొక్క తాకిడికి
చెట్ల పై భాగములు కదులు చుండెను
అవి సీతాదేవికి అభయము నిచ్చుచున్నట్లు ఉండెను.
రావణునిచే అపహరింపబడుచున్న
సీతాదేవిని చూచి సూర్యుడు కడుదీనుడై
తన కాంతులను కోల్పోయి వెలవెల బోయెను
అప్పుడు పగలే రాత్రిలా కనబడుచుండెను.
రామా! లక్ష్మణా అంటూ! దుఃఖస్వరముతో
జాలిగా నేలపై చూస్తున్న సీతాదేవిని చూచి
వనదేవతలు మిగుల వణికి పోవుచుండిరి
పక్షులు, మృగములు అటు నిటు పరుగెత్తుచుండెను.
సీతాదేవి కురులు చెదిరియుండెను
నొసట దరించిన తిలకము చెదిరిపోయెను
రామలక్ష్మణులు కనబడకుండుటచే
ఆమె మిక్కిలి భయముతో కృంగిపోయెను.
======================================
అరణ్యకాండమందు 52వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి