నా పతి తన తమ్మునితో వచ్చి నిన్ను చంపును
నీ మెడకు యమపాశము పడినట్లు
నేను తలంచుచున్నాను
ఓ రావణా! నీవు నివారింప శక్యముగాని
యమపాశముచే బంధింపబడితివి
శ్రీరామునికి భయపడుచూ నీవెక్కడికి వెళ్ళిన
నీకు మనశ్శాంతి లభించదు.
దండకారణ్యమున ఖరధూషణులను,
పదునాలుగు వేల రాక్షస యోధులను
శ్రీరాముడు ఒక్కడే హతమార్చెను
అతడు నిన్ను చంపకుండ ఎట్లుండగలడు?
రావణుని ఆధీనంలో నున్న సీతాదేవి
దుఃఖిస్తూ అతనికి శాపనార్ధాలు పెట్టెను
ఆమె మాటలు లెక్కచేయకుండ
పాపాత్ముడు ఆమెను తీసుకొని పోవుచుండెను.
======================================
అరణ్యకాండ మందు 53వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి