55వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
తనను భర్తగా స్వీకరింపమని రావణుడు ఆమె పాదాలపై పడుట 




రావణుడు సీతాదేవిని తలచుకొనుచు 
కామపరవశుడై సీతాదేవి వద్దకు వెళ్లెను 
అచట సీతాదేవి రాక్షస స్త్రీల మధ్యన 
మిక్కిలి దుఃఖిస్తూ శోకదేవతల యుండెను. 

బిక్కుబిక్కుమనుచు ఏడుస్తున్న 
సీతాదేవిని రావణుడు సమీపించెను. 
ఆ రాక్షసరాజు దివ్య భవనమును  
ఆమెకు బలవంతముగా చూపింపసాగెను.

వెండి బంగారు గోడలతో వజ్రాలు పొదిగి 
ఆ భవనము చాలా అందంగా యుండెను 
అందులో దిగుడు బావులు తామరకొలనులు 
వివిధములగు వృక్షములతో యుండెను.

పాపాత్ముడైన రావణుడు వైదేహికి 
తన భవనములన్నింటిని చూపించి 
ఆమెను ప్రలోభ పెట్టుటకై ఆమెతో ఇట్లనెను. 
ఓ సీతా! నిన్ను పువ్వుల్లో పెట్టుకొని జూచెదను. 

ఓ సీతా! నా రాజపరివారములన్నియు 
నా సర్వస్వమును నీ ఆధీనమే 
నీవు నాకు ప్రాణం కంటెను మిన్న 
అందుకని నీవు ప్రేమతో నా భార్యవు కమ్ము.

కామెంట్‌లు