57వ సర్గ : ( 2 ) : - ఎడ్ల లక్ష్మి


రాక్షసుల నిలయమైన వనము నందు 
నాఅన్న వారు లేకుండా సీతను ఒంటరిగా విడిచి 
వచ్చినందుకు లక్ష్మణుని శ్రీరాముడు మందలించెను 
లక్ష్మణుని చెయ్యి పట్టుకొని ప్రేమతో ఇట్లనెను. 

సౌమ్యుడైన ఓ లక్ష్మణా! నీ వదినను 
ఆశ్రమమున ఒంటరిగా విడిచి వచ్చితివి 
నీవు చేసిన ఈ పని గొప్ప తప్పు సుమా! 
అచట సీతాదేవి క్షేమమే కదా! 

నాకు అపశకునములే కనబడుచున్నవి 
రాక్షస మూకలు ఆమెను చంపలేదు కదా! 
నీవు సందేహించకుండా తెలుపుము 
మారీచుడు నన్ను చాలా దూరము తీసుకెళ్లినాడు

ఓ మహాబలా! ఆ రాజకుమారి క్షేమమే గదా!
ఓ లక్ష్మణా నా మనసు దైన్యమునకు లోనై 
సంతోషమునకు దూరమైనది 
సీతనుఏ రాక్షసుడైన అపహరించెనో!

=====================================

అరణ్యకాండమందు 57వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు