మారీచుని హతమార్చి ఆశ్రమమునకు బయలుదేరిన
శ్రీరామునకు అపశకునములు ఎదురగుట
మారీచుని వధించి శ్రీరాముడు
తిరిగి ఆశ్రమమునకు వచ్చే దారిలో
అతనికి అపశకునములు ఎదురగుచుండెను
అతని వెనుక నుండి నక్క కూత పెట్టుచుండును
నక్క ఇట్లు అరుచుట అశుభ సూచకము
మారీచుడు నా కంఠస్వరముతో అరిచిన
అరుపులు విని సీతలక్ష్మణులు భీతి చెందిరేమో!
రాక్షసులందరు కలిసిచేసిన పన్నాగమేమో
సీతాదేవికి ఏ ఆపద నొనర్చెదరో?
ఆశ్రమము చెంత సీతా లక్ష్మణులు
ఏ ఆపద లేక క్షేమముగా యుందురు కదా!
దీనవధనుడైన శ్రీరాముని చూచి పక్షులు
మృగములు ఆయన చుట్టూ తిరుగుచు
భయంకరముగా అరవసాగెను
అరుపులు విని శ్రీరాముడు దిగులుపడుచుండెను.
మిక్కిలి దుఃఖముతో యున్న లక్ష్మణుడు
కొంత దూరమున చింతాక్రాంతుడై
వచ్చుచున్న శ్రీరాముని సమీపించెను
రాముడు లక్ష్మణుని చూచి ఇట్లనెను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి