59 వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
సీతాదేవిని ఆశ్రమమున ఒంటరిగా వదిలి వచ్చిన కారణమేమి? 
అని రాముడు లక్ష్మణుని ప్రశ్నించుట.




"ఓ లక్ష్మణా! నీ రక్షణలో నున్నప్పుడు సీతాదేవికి 
ఎట్టి ప్రమాదము కలగదనే విశ్వాసముతో 
నేను ఆమెను వనములో వదిలి వచ్చితిని 
ఆమెను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు?

అన్నా! నా అంతట నేనే ఇచ్చటికి రాలేదు 
ఆమె నన్ను తీవ్రమైన మాటలు అనుటచే 
ఓ అగ్రజా! నేను నీ కడకు వచ్చితిని 
నేను సత్యమే పలుకుచున్నాను. 

అయ్యో! సీతా! అయ్యో! లక్ష్మణా!
నన్ను రక్షింపుడు; రక్షింపుడు అని 
నీ కంట స్వరముతో పలికిన మాటలను 
ఆమె విన్నంతనే భయంతో వణికిపోయెను

లక్ష్మణా ! అన్న చెంతకు వెళ్ళమని తొందర పెట్టెను 
ఆమె ఎంతగా ఒత్తడి చేయుచున్నను 
మీఅజేయత్వముమీద ఉన్న నమ్మకముచే 
అన్నకు ఏమి కాదని ఆమెతో చెప్పితిని.

శ్రీరాముని జయింపగల మొనగాడు 
ఈ ముల్లోకములలోను పుట్టలేదు పుట్టబోడు
అంతేకాదు ఇంద్రాది దేవతలు సైతము 
శ్రీరాముని జయింపజాలరు అని తెలిపితిని .

కామెంట్‌లు