వారికి సంతోషము గూర్చుచుండుదానవు
భార్య ఎడబాటుతో బాధపడుతున్న నాకు
నా సీతజాడ తెలిపి సంతోషపరచుము
ఓ నేరేడు వృక్షమా! నా సీత జాడ తెలుసా!
నీ పండ్ల వలే నిగనిగలాడు శోభలుగలది
ఆమె నీకు కనబడి యున్నచో వెంటనే
ఏమాత్రము దాచక నాకు తెలుపుము.
శ్రీరాముడ మామిడి వృక్షములను
మంకెన చెట్లను, పనసవృక్షములను
ధవవృక్షములను, దానిమ్మ చెట్లను,
మల్లెతీగెలను, అడుగుచుండెను.
శ్రీరాముడు మృగములను సమీపించి
ఓ హరిణమా! జింకపిల్లవలె కన్నులుగల
మా మైథిలిని నీవు ఎరుగుదువు గదా!
నా సీత ఆడలేళ్ల మధ్య ఉండియుండెనా!
ఓ పెద్దపులీ ! నీవు భయపడవలదు
నిన్ను ఏమి అనను నన్ను నమ్ముము
చంద్రుని వలె అందమైన ముఖముగల
నా ధర్మపత్ని నీకు కనబడినచో దెలుపుము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి