విరహవేదనకులోన శ్రీరాముడు సీతాదేవికొరకై మిగుల పరితపించుట.
చెట్ల మీది పుష్పాలు వాడిపోయి ఉండెను
రావణుడు సీతాదేవిని తీసుకెళ్లే సందర్భంలో
అచట ఆసనములన్ని చెల్లాచెదురై ఉండెను
అట్టి ఆశ్రమప్రదేశమును చూచి శ్రీరాముడు
అటు ఇటు చూస్తూ విలపింప సాగెను
సీతనెవరైనాఅపహరించుకొని పోయిరా?
భీతితో ఆమె ఎచ్చట నైన దాగి యున్నదా?
స్నానమునకై సరస్సునకు వెళ్లినదా?
జలము తెచ్చుటకై నదికి వెళ్ళినదా?
ఫలములు తెచుటకై వనమునకెళ్లినదా?
శ్రీరాముడు పరిపరి విధముల తలపోసెను.
శ్రీరాముడు ఎంత వెతికినా సీత జాడ తెలియక
కొండలు, కోనలు తిరుగుచు గాలించెను
సీత జాడ తెలియక అతడు శోకిస్తూ!
చెట్లను, పుట్టలను, గట్లను అడుగుచుండెను.
ఓ మారేడు వృక్షమా! పద్మిని జాతికి చెందిన
నా సీత చిగురుటాకు వలె కోమలమైనది
పట్టు వస్త్రములు ధరించియున్నది
ఆమె నీకు కనిపించినచో నాకు తెలుపుము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి