62వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
సీతాదేవి ఎడబాటువలన శ్రీరాముడు  విలపించుట. 




శ్రీరాముడు సీత కనబడక పోవుటతో 
ఆమె మీద ఉన్న మిక్కిలి ప్రేమచే 
చేతులు చాచి విలపింప సాగెను
అతడామెను చూసినట్లుగా బ్రాంతి చెందును. 

"ఓ ప్రియురాలా! నీకు పువ్వులనిన, మిక్కిలి ప్రీతి 
అశోక వనములకు పూలకై వెళ్ళితివా! 
ఓ దేవీ! నవ్వులాటకై తోటలో దాగినావా? 
ఇట్టి పరిస్థితులలో అట్టి   పరిహాసము 
నాకు ఏమాత్రము నచ్చదు ఓ జానకీ!

ఓ సుందరీ! లోక పూజ్యురాలవైన ఓ సాద్వీ!
ఈ వనమున నీవు ఎటు పోయితివి?
శ్రీరాముడు సీతాదేవికై విలపించుచుండెను
లక్ష్మణుడు అన్నను ప్రేమగా ఓదార్చుచుండెను. 

ఓ లక్ష్మణా! నీ వెంత ఓదార్చిన గాని 
సీత లేనిది నేను జీవించ జాలను 
కావున నన్ను ఈ వనమునందే విడిచి 
నీవు క్షేమముగా అయోధ్యకు వెళ్ళుము. 

నాయనా! లక్ష్మణా! శోకమున మునిగి యున్న 
కౌసల్యాదేవికి సుమిత్రా దేవికి నమస్కరింపుము 
నా తల్లికి విపులముగా తెలుపవలెను సుమా! 
లక్ష్మణుడు భయముచే చిన్నబోయి కలత చెందెను. 
--------------------------------------------------

అరణ్యకాండ మందు 62వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు