ధనస్సులు, అమ్ముల పొదలును
చిన్నాభిన్నములై పడి యుండెను
రథశకలములు కూడా పడి యుండెను.
"ఓ సౌమిత్రీ! సీత అభరణములు గూడా
ముక్కలైన హారములిచట పడి యున్నవి
రాక్షసులు వైదేహిని భక్షించియుండవచ్చు
ఇచ్చట అన్ని హద్దులు కనబడుచున్నవి.
ఓ లక్ష్మణా! సీతను అపహరించుటనో
లేక భక్షించుటనో జరిగి యుండవచ్చు
ఆ సమయంలో ఆమెను ఆదుకొనగలిగిన
మహాత్ములెవరు తటస్థపడలేదేమో!
ఓ లక్ష్మణా! దేవతలందరును గూడి
సీతాదేవిని భద్రముగా నాకు అప్పగించనిచో
వారు నా పరాక్రమమును చవిచూడగలరు
నా బాణములతో ఆకాశమును కప్పివేసెదను.
ఓసౌమిత్రీ! నా శర ప్రయోగములతో
సమస్త జగత్తును కల్లోలపరిచెదను
పక్షులు, మృగములు సమస్త ప్రాణులు
ఏవి కూడా మిగులకుండ మరణించును
శ్రీరాముడు బాణమెక్కుపెట్టి క్రుద్ధుడై ఇట్లనెను
దేవతలామెను క్షేమముగా నాకు అప్పగించనిచో
దేవతలను, గంధర్వులను, మానవులను.
సమస్త జగత్తును నాశనము చేయుదును.
==================================
అరణ్యకాండమందు 64వ సర్గ సమాప్తము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి