65వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
శ్రీరాముడు లోకములను ధ్వంసము చేయుటకు సిద్ధపడగా 
లక్ష్మణుడు మృదవచనములతో ఆయనను శాంతపరుచుట 




సీతాదేవి ఎడబాటు వలన బాధపడుచున్న
శ్రీరాముడు మిక్కిలి పరితపించుచుండెను 
ప్రళయ కాలాగ్నివలె లోకములను 
ధ్వంసమొనర్చుటకు సన్నద్ధుడైయుండెను. 

ఓ అన్నా! నీవు మృదుస్వభావుడవు
సకలప్రాణుల హితము కోరువాడవు
అగ్రజా!నీవు ఇట్లు క్రోధవశుడవై 
ప్రకృతిని ద్వంశమొనర్పబూనుట తగదు

ఓ రఘువీరా! సకల ప్రాణులకు నీవే దిక్కు 
యజ్ఞదీక్షకులను, ఋథ్వీజులను, ఋషులను 
నదులను ,పర్వతములను. దేవగంధర్వులను 
ఆప్రియము కూర్చుటకు సమర్థులు కారు 

ఓ రాజా! సీతను అపహరించిన దుష్టుని 
అన్వేషించుటకై నీవు బాణాలతో సిద్ధపడుము 
నేను నీకు తోడుగా వచ్చెదను అన్నా! 
దేవగంధర్వ లోకములను దీక్షతో గాలింతాము. 

ఓ కోసల ప్రభూ! దేవతలు సామోపాయముచే 
నీ ప్రేమపెన్నిధిని నీకు అప్పగించనిచో 
సీత జాడ తెలియనప్పుడు నీవు 
నీ శరములతో సమస్త లోకమును రూపుమాపుము. 

======================================

అరణ్యకాండమందు 65వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు