67వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
రామలక్ష్మణులు జటాయువును కలుసుకొనుట

       శ్రీరాముడు ఆ పక్షిరాజును అక్కున జేర్చుకొని ఏడ్చుట. 





శ్రీరాముడు తన కోపమును నిగ్రహించుకొని 
నాయనా! లక్ష్మణా! ఇక మన కర్తవ్యమేమిటి? 
సీత జాడకై ఏమి చేయాలో యోచించుము 
అప్పుడు లక్ష్మణుడు శ్రీరామునితో ఇట్లనెను. 

ఓ మహాపురుషా! నీవంటి మహాత్ములున్నచో 
ఎంతటి ఆపదలు ఎదురైనా కానీ తొణకరు
అట్టి నీవు నా వెంట ఉండగా భయమేమి లేదు 
ఈ అడవినంతయు గాలించుదాము 

వారిరువురు బాణములను చేతబూని 
దండకారణ్యమునందు వెతక సాగిరి 
వారికి రక్తముతో జటాయు ఎదురయ్యెను
రామునితో అది ఇట్లు పలుకుచుండెను 

ఓ ప్రభూ! ఈ మహాఅరణ్యము నందు 
సీతాదేవికై అన్వేషించుచున్నావు 
ఆమెను ఓ రాక్షసుడు అపహరించినాడు 
ఆ దుర్మార్గుని పేరు రావణుడు 

నా ప్రాణములను గూడా అతడే హరించెను 
ఓ రామా నీవును, లక్ష్మణుడును 
ఆశ్రమమున లేనప్పుడు ఒంటరిగా ఉన్న 
సీతాదేవిని రావణుడు అపహరించినాడు

కామెంట్‌లు