68వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
శ్రీరాముడు జటాయువుకు అంత్యసంస్కారములు నొనర్చి మోక్షము నొసంగుట




రావణుడు పడగొట్టిన జటాయును జూచి 
శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు అనెను 
ఓ లక్ష్మణ నాకు సహాయ పడటకై వచ్చిన 
యుద్ధముల రావణునితో దెబ్బతినను 

 ఓ జటాయు నీలో శక్తిని పెంచుకొని 
సీత గూర్చి నాకు తెలుపుము 
సీతాదేవి నీతో పలికిన మాటలేమి?
ఓ పక్షి రాజా అతని రూపమెట్టిది?

అతని నివాసం ఎక్కడ! నాతో తెలుపుము 
ఓ రఘువరా! రావణుడు తన మాయతో 
మాబ్బులు కమ్మినట్లుగా చేసి గాలులు సృష్టించి 
ఆకాశమార్గమున సీతను అపహరించెను. 

సీతను అపహరించిన ముహూర్తము 
వింద ముహూర్తము అది అతనికి తెలియదు 
ఆ ముహూర్తము అతనికి మరణ కాలము 
అతనికి నీ చేతిలో చావు తప్పదు రామా!

జటాయువు అలా పలికి మెడలు వాల్చెను
శ్రీరాముడు పక్షిని చూచ దుఃఖించెను 
పక్షిని చితిపై చేర్చి అంత్యక్రియలు చేసి 
జటాయువుకు మోక్ష ప్రాప్తిని ప్రసాదించెను

అరణ్యకాండమందు 68వ సర్గ సమాప్తము.
కామెంట్‌లు