రావణుడు సీతాదేవిని అపహరించినాడు
సీత ఏడబాటుతోనేను దుఃఖితుడనైతిని
ఆమె జాడకై నీవు సహాయపడుము
ఓ రామా! ప్రస్తుతము నాకు దివ్య జ్ఞానం లేదు
సీతాదేవి గూర్చి నేను ఏమి యెరుగను
మీరగ్ని సంస్కారములను చేయుటచే
నిజ రూపమును పొంది ఆమె గూర్చి తెలుపెదను
ఓ ప్రభూ! దహన సంస్కారముతో
నా నిజరూపమును పొందునంతవరకు
ఆమెనపహరించిన రాక్షసుని గూర్చియు
తెలుసుకొనగల శక్తి నాకు లేదు
సూర్య భగవానుడు అస్తమించక ముందే
ఓ రఘువీరా! ఇప్పుడే పెద్ద గోతిలో వేసి
నన్ను పూర్తిగా దగ్ధమొనర్చి పిమ్మట
నేనెరిగినంతవరకు మీకు తెలుపగలను.
న్యాయానికి కట్టుబడి యుండు వానితో
మీరు స్నేహం చేయవలసియున్నది
తన పరాక్రమముతో మీకు తోడ్పడగలడు
అతనికీ మూల్లోకములలో తెలియనిది లేదు.
------------------------------------------------------------
అరణ్యకాండమందు 71 వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి