రామలక్ష్మణులు కబంధుని దేహమునకు అగ్ని సంస్కారమొనర్చుట
దహనసంస్కారలను గావించిరి
అగ్నికి ఆహుతి అయిన అతని శరీరము
దివ్య తేజస్సుతో నిజరూపము దాల్చెను
ఓ రామా! నీ భార్య యెడబాటు వలన
దుఃఖమున కృంగిపోవుచుంటివి
మీరు ఆపదలో చిక్కుకొనియుంటిరి
మీకు సహాయపడు మిత్రుని ఆశ్రయించుడు
ఓ రామా! ఆ వానర ప్రభువు బలశాలి
మాటకు కట్టుబడి ఉండేడివాడు
అతడు రాజ్య కారణము వలన తన అన్నయగు
వాలిచే కిష్కింద నుండి వెళ్లగొట్టబడెను.
ఆ సుగ్రీవుడు మీకు సహాయపడును
ఓ రామా! మీరు వెంటనే బయలుదేరి
పరాక్రమశాలియన సుగ్రీవుని కలుసుకొని
అగ్నిసాక్షిగా ఆయనతో మైత్రిని జేయుము
ఆ కపిశ్వరుడు సీత గూర్చి అన్వేషించుటకు
వానరులను దశదిశలుగా పంపగలడు
రావణుడు జానకిని ఎక్కడ దాచిన గాని
అతడు రాక్షసులను జంపి సీతాదేవిని తేగలడు.
==========================================
అరణ్యకాండమందు 72వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి