ఆ గుహలో నివసించుచుండెను
అతడాపర్వత శిఖరము పై తిరుగుచుండును
సుగ్రీవుని గూర్చి రామునికి తెలిపెను
కబంధుడు కంఠమున మాల ధరించి
ఆకాశాన సూర్యకాంతిలా వెలుగుచుండెను
సుగ్రీవుని గూర్చి అతడు తెలిపిన పిదప
రాముని ఆజ్ఞకై నిరీక్షించుచుండెను
రామలక్ష్మణులు ఆకాశాన నిలిచి యున్న
మహాత్ముడైన కబంధుని చూచి
ఇక నీవు వెళ్ళుమని అనుజ్ఞ నిచ్చిరి
వారు అచ్చట నుండి వెళ్ళుటకు సన్నద్ధులైరి
కబంధుడు రామలక్ష్మణులను జూచి
కార్యసిద్ధికై మీరు బయలుదేరుమని తెలిపెను
అతని మాటలకు వారు సంతోషించి
కబంధుని ప్రయాణానికి అనుమతించిరి
కబంధుడు తన పూర్వ రూపమును పొంది
సూర్యకాంతులతో వెలుగొందెను
వారికి పంపాసరోవర మార్గమును చూపి
అతడు ఆకాశముపై నిలిచిపోయెను.
==============================
అరణ్యకాండమందు 73వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి