73వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
దివ్య స్వరూపమును పొందిన కబంధుడు ఋశ్యముఖ పర్వతమున నివసించే 
సుగ్రీవుని కడకు వెళ్లే మార్గమును రామలక్ష్మణులకు దెలుపుట




ఓ శ్రీరామా! మీరు పశ్చిమ దిశన వెళ్లినచో 
దారిలో పలు రకముల చెట్లు యుండును
ఓ లక్ష్మణా! ఆ వనమును దాటిన పిదప 
మీకు చక్కని వనము కనిపించును 

ఓ రామా! అచ్చట మీరు విహరించినప్పుడు 
పూలతో వికసించి ఉండే చెట్లను చూడగా 
నీ మనసు ప్రశాంతముగా యుండును 
ఆ పుష్పములు ఎప్పుడు కూడా వాడవు 

అచట మతంగమహర్షి ఉంటాడు 
అతడే ఆశ్రమమును నిర్మించుటవలన 
ఆశ్రమమునకు ఏ మృగములు చేరవు 
అది మతంగవనమని ప్రసిద్ధి గాంచెను.

పంపాసరోవరమునకు తూర్పున 
ఋష్యమూకపర్వతము గలదు 
ఆ పర్వతముపై నిదిరించిన వానికి 
నిద్రలో వచ్చే స్వప్నములు నిజమగును 

ఆ ఋశ్యముఖపర్వతము మీద ఒక గుహ కలదు 
దాని ద్వారము శిలలచే కప్పబడి యుండును 
అందు ప్రవేశించుటకు చాలా కష్టము
ఆ గుహ తూర్పుభాగమున చల్లని నీరు యుండును. 

కామెంట్‌లు