ఫలములను నీ కొరకై నేను సిద్ధపరిచితిని
ఓ శబరి ఈ మహా వనమును చూడగోరితిని
వారికి ఆమె ఆ వనమును చూపించెను
ఓ రామా! ఈ వన శోభలను కనులారా గాంచితివి
వాని మహత్యము గూర్చి పూర్తిగా వింటివి
మీ అనుమతి అయినచో ఈ తనువును
పరిత్యజింప గోరుచున్నాను.
ఓ శబరీ! భక్తితో చేసిన నీ పూజలకు
నేను ఎంతయో సంతోషించితిని
నీ ఇష్టానుసారము తో హాయిగా వెళ్ళుము
అప్పుడే ఆమె శరీరమును విడువదలచెను
శ్రీరామునిఆజ్ఞయైన పిదప తన దేహమును
అగ్నికి ఆహుతిగాజేసి అగ్ని తేజస్సువలె వెలుగుచు
ఆమె పరంధామమునకు చేరెను
శబరి పరంధామమునకు వెళ్ళినప్పుడు
సుగంధ లేపనములతో, అద్భుతమైన వస్త్రములతో
ఆమె విద్యుల్లత వలె మెరియుచూ
మహర్షులు చేరిన అక్షయలోకములకు
శబరియు తన సమాధి యోగ ప్రభావము చేరెను.
======================================
అరణ్యకాండ మందు 74వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి