75 వ స్వర్గ : - ఎడ్ల లక్ష్మి
ఋష్యమూక పర్వతమునకు వెళ్ళుచు పంపాసరోవరతీరమునందలి 
దృశ్యములను గాంచుట. 




శబరి తనయోగబలముచే స్వర్గము చేరిన పిదప 
శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను
సప్తసాగరతీర్థములలో స్నానము చేసి 
పితృదేవతలకు తర్పణము ఆచరించితిమి

అందువలన మనకు అశుభములు నశించి 
శుభఫలములు కలుగుచున్నవి కదా!
ఓ అగ్రజా! నా హృదయమునందు గూడా 
శుభసూచక సంకల్పములు కలుగుచున్నవి 

ఓ లక్ష్మణా! ఈ పంపాసరోవరతీరము వెంట 
ఋష్యముఖ పర్వతమునకు వెళ్లుదాము
సూర్య సుతుడైన సుగ్రీవుడు అచట 
వాలికి భయపడుచు కాలము గడుపుచున్నాడు 

రామలక్ష్మణులు కొంత దూరము నడిచి 
మతంగసరస్సు నందు స్నానమాచరించిరి
ఆ పంపానదితీరము కలువలతో నిండి ఉంది 
అచట నెమళ్లు తిరిగాడుచుండెను 

రకరకాల వృక్షాలతో రమ్యముగా యుండెను 
రామలక్ష్మణులు ఏకాగ్రత చిత్తులై 
పక్షుల కుజితములతో కళకళలాడుచున్న 
ఆ వనమును దర్శించుచు  ముందుకు నడిచిరి
కామెంట్‌లు