ప్రకృతి జీవగర్ర!: - డా ‌పివిఎల్ సుబ్బారావు, విజయనగరం,- 94410 58797.

 

చూడు, నేడు చేసింది కన్నెర్ర!
పగిలిపోతోంది మనిషి బుర్ర! 
కురిసే వాన, ఓ కుంభవృష్టి!
వీచే గాలి, ప్రభంజన సృష్టి! 
బతుకునావకు, సుడిగుండం!
క్షణం క్షణం అదే, యమగండం!

ప్రకృతి ఎలా ఉన్నా,
                       క్షేమం దైవం! 
ఉత్సవాలు ఖాయం,
   ఊరేగింపులు నిరాటంకం!
జీవుడి బతుకే ,
అంతుచిక్కని అయోమయం! 
ఇంకా బయటా,
       ఏలుతున్నది, బీభత్సం!
పాడి పంట, కళ్ళముందే,
             జనం జలార్పణం!

మానవ హృదయ దౌర్బల్యం! 
నేటి ఈ ప్రకృతి అసమతుల్యం!  
తిలాపాపం తలా పిడికెడు!  ప్రకృతివైపరీత్యాలు, 
           తరుచూ, అడుగిడు!
 కాలం ఆడుతోంది ,
        మనిషితో చెడుగుడు!

పదిమంది మేలు పుణ్యం!
 ఒక్క కీడు చాలు పాపం!
మంచి పెంచు, ఇల స్వర్గం! 
జీవితానికి, భద్రతా దుర్గం!

ప్రకృతి సమతుల్యం కావించు!
 అకృత్యాలకు ఇక తెరదించు!
సాటి మనిషిని కాస్త బతికించు!
 మనిషి,నీవో మనిషివనిపించు!
_________

కామెంట్‌లు