నీ అక్రమ దాడులు ఆపుకో ఇకనైనా
ఆపకుండా నీవు అడ్డకాలు ఇక వేస్తే
నిన్ను ఎదుర్కొను గుండె ధైర్యం మాకు మస్తే !
చైనా చైనా చైనా ఓ చైనా
నీ బుద్ధి మార్చుకో ఇకనైనా
స్నేహానికి భంగం నీ ఈ చర్య
గమనించి నడుచుకో ఓ ఆర్య !
సరిహద్దుల్లో వివాదం అసలు వద్దు
ఎవరి హద్దుల్లో వారు ఉంటేనే ముద్దు
ఈ పరమసత్యం తెలుసుకో ఓచైనా
అసత్యాలకు పాల్పడకు ఇకనైనా !
దాడులు చేయడం మాకూ వచ్చు
పెట్టగలం మీలో మీకు మేం చిచ్చు
మీరు చేసిన ఈ తప్పే మేమిక చేస్త
మీకు మాకు బేధం లేదుగా గమనిస్తే !
చైనా చైనా చైనా చైనా ఓ చైనా మాపైన
నీ నక్కజితులు మానుకో ఇకనైనా
ఏ దేశం కూడా నీకు లేదు సపోర్టు
అన్ని దేశాలు అందిస్తున్నదే ఈ రిపోర్టు!
ఇరుదేశాలకు కలుగును విపరీత నష్టం
పరదేశాలకు మిగులును అపార కష్టం
ఈ కష్టనష్టాలకు అవుతారు బాధ్యులు మీరే
స్పష్టం చేశాక వినకుంటే మీకు మిగిలేది ఉరే !
హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు ఓ చైనా
బుద్ధి మార్చుకొని నడుచుకో ఇకనైనా
మారకుండా నీవు దూరి మా ముందుకు వస్తే
చూడకుండా నీ మొఖం మేం మారి పట్టేది కుస్తే !
వెన్నుపోటు పొడిచుటే మీకు రివాజు
కన్ను గీటి కలిశాడు మీకు పాకిస్తాన్ నవాబు
ఇంకా మీకు తిరుగులేదని మీరు అనుకోవద్దు
సంక నాకి తరిగిపోవు మీ మైత్రి ఇంతటితో రద్దు !
మన దేశాల మధ్యనున్న సరిహద్దులో
అమరులైన వీర జవాన్లకు వందనం
సమర శంఖం పూరించి చేస్తాం అభివందనం
రుధిర పంకం తుడిచి చేస్తాం నంద నందనం !
దున్న దున్నలు పోట్లాడితే కాట్లాడితే
దూడలకు లేగ దూడలకు కల్గు నష్టం
ఇరుదేశాల మధ్య వద్దులే యుద్ధం
శాంతి ప్రశాంతికి కావలిక సన్నద్ధం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి