మార్పు మన మంచికే : - అంకాల సోమయ్య -దేవరుప్పుల - జనగామ -9640748497


ఎదురు తిరగడం 
బానిసత్వం ఉన్నచోట 
హక్కులు హరించి వేయబడ్డ చోట 
విప్లవం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది 
రక్తపాతం జరిగిన 
ఆత్మగౌరవ పోరులో ప్రాణత్యాగమైన ఆహ్వానించదగినదే

భవిష్య దర్శనం 
 వీరావేశ ప్రదర్శన 
నల్ల బ్యాడ్జీలు ధరించడం 
మార్పుకు ఎత్తిన పతాకం

పరివర్తన 
ఈ ధిక్కార స్వరాలది
సకల చరాచర జగత్తుకు 
గొడుగైనది ఆ నింగే
అభ్యుదయానికి నాంది ప్రస్తావన 

అణగారిన బ్రతుకులు 
రేపటి నవోదయానికై తీక్షణమైన చూపులు 
భ్రమలో మునిగితే 
బ్రతుకు చిక్కి శల్యమై గాఢాంధకారంలోకే

అహోరాత్రులు శ్రమించిన శ్రమజీవుల స్వేదం 
భావి జీవితం ఆకాశ హర్మ్యమై
నల్లేరుపై బండి నడికే 

సమూహంతో జతకట్టినోడు 
ఏకాకెట్లైతడు
శోకగీతమే 
కాలాన్ని ధర్మాన్ని
గొంతెత్తి గానం చేసేది 

మార్పే జీవన తీర్పై
జన జీవితాలు 
భద్రంగా 
పదిలపరుచుకున్న 
మనుషులు 

కామెంట్‌లు