చెప్పేమాటలకన్నా చేసే పనులకే విలువలుంటాయని తెలుసుకోవాలందరు
కులమతాల మధ్య జాతివైరాలు
లేని వేషభాషలను గౌరవిస్తూ
ఈర్ష్య అసూయలు చూపక మనమంతా అందరిని గౌరవనీయంగా చూసే ఏకత్వం
పెంపొందించాలి
అందుకూ మనమంతా మానవత్వాన్ని అణువణువునా పుణికిపుచ్చుకోవాలి
కుడిచేయి చేసే దానం ఎడమ చేతికి తెలియకుండా గుప్తదానాలెన్నోచేయాలి
ఇందులో వ్యక్తిగత స్వార్థానికి తావుండకూడదు
అందుకూ మనుషులంతా కరుణాంతరంగులవ్వాలి
పదుగురి మేలుకోరేవాడే
మనీషి
లేకుంటే ఎవరైనా సాధారణ మనుషులే
ఆకలితో అల్లాడిపోతున్న పేదల దైన్యం చూసైనా
ఉదారత చూపాలి
బాధాసర్పద్రష్టులకు ఓదార్పు నివ్వాలి
ప్రతీ మనిషి హృదయం విశాలమవ్వాలి
శాంతి సౌఖ్యం సమరసభావం
ప్రతి మదిలో పాదుకొనాలి
చెరగని చిరునవ్వు
నీ బాధల సుడిగుండాలను దాటిస్తుంది
నీ దయాగుణం ఎందరో జీవితాల్లో వెలుగులను ప్రసరింపజేస్తుంది
మంచి మమతను నేర్పేదే అసలైన విద్య
ఎవరూ పుట్టుకతో గొప్పవారు కారు
వారి చర్యలతో పరమపూజ్యులౌతారు
మానవతావాదులే
దైవ స్వరూపులు
సాటి మనిషి కష్టసుఖాల్లో తోడ్పాటునందిస్తూ
మనిషిగా జీవించడమే నిజమైన మానవత్వం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి