ఓ ఓటరన్న (సోయితో మసలుకో): - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-9640748497


ఆయారాం
 గయారాం
అన్నచందంగా పార్టీలు మారుతూ 
వ్యక్తిగత స్వార్థమే ఏకైక ఎజెండాగా 
మార్చారు 

రియాల్టర్లు ,బడా పారిశ్రామికవేత్తలు
 వారి నల్లధనాన్ని చెలామణిలోకితేవడానికై
అన్నీ వ్యవస్థలను డబ్బుతో కొనుగోలు చేసి 
ప్రజాస్వామ్యంముసుగులో
ఓటుకు నోటు పంచి అధికార పీఠం చేజిక్కించుకొని 
బినామీ పేర్లతో స్వీయవిద్య వైద్యం 
రియలెస్టేట్ వ్యవస్థలనెలకొల్పివాటినే బలోపేతం చేసుకుంటున్నారు 


నైతిక మానవ విలువలకు తిలోదకాలిచ్చి
నయవంచనే పరమావధిగా 
నియంతల్లా వ్యవహరిస్తున్నారు 

ఎన్నికల్లో కపట ప్రేమను ఒలకబోస్తూ 
గెలుపే లక్ష్యంగా 
గడప గడపకు తమపార్టీ ప్రచారనిమిత్తమై 
ప్రచార కూలీలను ట్రక్కుల్లో తరలిస్తున్నారు

ఓ ఓటరన్న జరజాగ్రత్త
నయా మోసగాళ్ళు 
పగటివేషగాళ్ళు
పూటకో వేషం 
మాట మాటలో తీయ్యటి విషాన్ని చిమ్ముతూ 
నోటుతో నాటుతో లొంగదీసుకోవాలనిచూస్తున్నాడు
తలొగ్గితివా ఎన్నికల మరునాడు 
నిన్ను శంకరగిరిమాన్యాలు పట్టిస్తాడు
ఈ దుష్ట పాలకులకు ప్రజాసంక్షేమం పట్టదు
వీరంతా ప్రజాకంటకులు నియంతలే 
వీరంతా నయా బ్రిటిష్ రూలర్స్ 
తస్మాత్ జాగ్రత్త

కామెంట్‌లు
Popular posts