అక్షర సందేశం : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

దూరం చేసుకోకు 
ప్రేమించే వారిని 
చెంత పెట్టుకోకు 
చెరుపు చేయు వాటిని 

నమ్మాలి పూర్తిగా 
ఉండాలి స్ఫూర్తిగా 
నిలబడాలి సతతము 
దేశానికి కీర్తిగా 

పిల్లలను ప్రేమగా 
చూడాలి చూడాలి 
వారి భవిత గొప్పగా 
ఉండేలా చేయాలి 

అందరితో మైత్రితో 
కాస్త జాగ్రత్తతో 
బ్రతకాలి బ్రతకాలి 
అమ్మలాంటి మనసుతో

కామెంట్‌లు