నీగ్రోల అభ్యున్నతికై పాటుపడిన ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు అబ్రహాంలింకన్!యు.ఎస్.ప్రెసిడెంట్ గా కాక గొప్ప మానవతావాదిగా ప్రపంచ చరిత్రలో నిలిచాడు.ఆయనని అవమానించి ద్వేషించినవారు కోకొల్లలు.తనకు ఇష్టులైనవారిని అఇష్టులైనవారిని కూడా నిశబ్దంగా భరించిన అపురూప వ్యక్తి.విచిత్రమేమంటే లింకన్ కొంతమందికి పదవులు కట్టబెట్టాడు వారిపై నమ్మకం ప్రేమాభిమానాలతో! కానీ ఛేస్ ,స్టాంటన్,స్టీవర్డ్ అనే కొందరు లింకన్ అనుగ్రహంతో పదవుల్లో కూచుని,బాగా మెక్కి ఆయన పై తీవ్ర ఆరోపణలుచేసి దూషించి అవమానపరిచారు. కానీ లింకన్ ఇలా ఆలోచించేవాడు" మంచిపని చేస్తే పొగిడి,చెయ్యకూడనిపని చేస్తే దూషించరాదు" అని.ధర్మరాజు లాగా ఆలోచిస్తే,నేడు దేశంలో అరాచకం పెరుగుతుంది.
ఇక లారెన్స్ జోన్ అనే నీగ్రో "మనజాతివారిలో చురుకుదనం రావాలి.జీవిత యుద్ధరంగంలో ప్రతినీగ్రో పోరాడితీరాలి" అని ప్రచారంచేస్తున్నాడని కొంతమంది శ్వేత జాతీయులు జోన్ ని త్రాళ్లతో కట్టి ఈడుస్తూ లాక్కువెళ్లి చెట్టుకి ఉరి తీసేప్రయత్నం చేశారు.జోన్ తనజీవితం గూర్చిఇలా చెప్పాడు" నేను 1907లో డిగ్రీ పొందాను. స్కాలర్ షిప్స్ తో చదివాను.పాటలు పాడి నాఅధ్యాపకులను,స్నేహితులను అలరించాను. ఓహోటల్ యజమాని తనతో కల్సి వ్యాపారం చేయమన్నాడు.ఓసంగీతవిద్వాంసుడు తనతో కల్సి కచేరీలు చేయమన్నా నేను అంగీకరించలేదు.నా నీగ్రోజాతి ప్రజల కష్టాలు కన్నీరు తుడవాలని నిశ్చయించుకున్నాను. నాచేతి వాచీని 1.65డాలర్లకు తాకట్టు పెట్టి నీగ్రోపిల్లలకోసం బడి నెలకొల్పాను.కొంత మంది శ్వేత జాతివారు నాకు భూమిడబ్బు ఆవులు ఇచ్చి సహాయం చేస్తే నేను నీగ్రోపిల్లలకు చదువుతో పాటు వ్యవసాయం,వంటచేయటంలో తర్ఫీదు ఇచ్చాను." ఈమాటలువిన్న ఓపెద్ద మనిషి తన నెత్తినటోపీ తో అప్పటికప్పుడు విరాళాలు వసూలు చేయటం ఓఎత్తు ఐతే అతని బడికి సాయం చేయటం ఇంకో గొప్ప విషయం!ఎపిక్టస్ ఇలా చెప్పాడు" మనం ఏవిత్తు నాటితే అదే మొలక చెట్టుగా మారి ఫలాన్నిస్తుంది. " మనపురాణకథలు ఇవే చెప్పాయి.కానీ నేడు మంచితనం, పరోపకారం ఉన్న వ్యక్తిని చేతగాని అసమర్థుడు అని హేళన చేసేవారు ఎక్కువైనారు. అలాంటివారివల్ల దేశ భద్రత, రాష్ట్ర పురోగతి దెబ్బతింటుంది .కాబట్టి వెంటనే దానికి చికిత్స చేయకపోతే పురుగుపట్టిన చెట్టులా నాశనం అవటం ఖాయం! 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి